చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో సోమవారం చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల అన్ని గ్రామాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ .శ్రీకాంత్ తెలియజేశారు .
ఒకటి నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని అన్నారు .స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు ఈ టాబ్లెట్లను వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ,,విద్యార్థులకు సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్రలు వేయడం ద్వారా పిల్లల్లో నట్టల నివారణ జరుగుతుందని, పిల్లల్లో రక్తహీనత లేకుండా ఈ మాత్రలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, ఉపాధ్యాయులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

























