ఎస్సీ, ఎస్టీ నిధులు కేటాయించాలి – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఎంఆర్‌పీఎస్ వినతి.
ఎంఆర్‌పీఎస్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి…
నిజామాబాద్ జూలై 20: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఎంఆర్‌పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ నగర అధ్యక్షుడు మల్లమారి సుధాకర్, జిల్లా అధ్యక్షురాలు లత, నగర అధ్యక్షురాలు సమదాన, పరశురాం, రాము, విశాల్ తదితరులు కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను తగిన విధంగా కేటాయించాలని కోరారు. అలాగే ఎంఆర్‌పీఎస్ భవన నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షుడిని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్‌ను నాయకులు కోరారు.

























