ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఎన్సీడీ సేవలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహిస్తున్నట్లు ఎన్సీడీ నర్సింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.

























