ధర్పల్లిలో మటన్ షాపుల ఏర్పాటుకు స్థల పరిశీలన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, జూలై 23 : ధర్పల్లి గ్రామంలో మటన్ షాపుల ఏర్పాటుకు సంబంధించి గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, విలేజ్ కమిటీ సభ్యులతో కలిసి గురువారం స్థల పరిశీలన నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా మటన్ షాపులను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో మటన్ షాపులను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
స్థానిక ప్రజల అభిప్రాయాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని అందరికీ అనుకూలంగా ఉండే ప్రదేశంలో మటన్ షాపులను ఏర్పాటు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ స్థల పరిశీలనలో విలేజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

























