ప్రభుత్వాలు మారినా… నిజామాబాద్ డిపో-1లో పాత వ్యవహార శైలేనా? ఉద్యోగుల ఆవేదన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ డిపో-1లో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలిపై కండక్టర్లలో అసంతృప్తి నెలకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల ఆరోపణల ప్రకారం, జి.ఎస్. రెడ్డి సహా మరికొందరు సిబ్బంది తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చిన్న ఉద్యోగులతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఒకప్పుడు సాధారణ ఉద్యోగులుగా ఉన్నవారే ప్రస్తుతం కండక్టర్లను గౌరవించకుండా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో “గుడ్ మార్నింగ్” చెప్పినా ప్రశ్నించడం, చెప్పకపోయినా కారణాలు అడగడం, తదుపరి రోజు డ్యూటీల కేటాయింపులో ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉద్యోగులు చేస్తున్నారు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు.
ఉద్యోగానికి సంతోషంగా వచ్చే కండక్టర్లు కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోరనే భయం ఉందని వారు వాపోతున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత యూనియన్లు స్పందించి, నిజామాబాద్ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం), డిపో మేనేజర్ (డీఎం) మానవత్వంతో స్పందించి ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కండక్టర్లు కోరుతున్నారు.

























