తెలంగాణ సిద్ధాంతకర్త,ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ లో ఆర్ట్స్ కళాశాలలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్.డాక్టర్. లక్ష్మణాచారి,సీనియర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్. కనకయ్య,విశ్వవిద్యాలయ పీఆర్వో డాక్టర్.కె.వి. రమణాచారి,వివిధ విభాగాల అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది,విద్యార్థులుపాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలుమాట్లాడుతూ,ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితంనేటితరానికిఆదర్శప్రాయమనిపేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసినకృషి,త్యాగం, అంకితభావంచిరస్మరణీయమనకొనియాడారు.విద్యావేత్తగా,తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన సమాజంలో చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.ప్రత్యేకంగా విద్యార్థులు జయశంకర్ సార్ఆశయాలు,ఆలోచనలు,విలువలను తెలుసుకొని,వాటిని తమ జీవితంలో ఆచరించాలని సూచించారు.విద్య, సామాజిక బాధ్యత,ప్రాంత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకొని సమాజ పురోగతికి కృషి చేయాలని వక్తలుపిలుపునిచ్చారు.కార్యక్రమంలోఅధ్యాపకుల,,,సిబ్బంది,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు ఘన నివాళులు అర్పించారు.






















