మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి గ్రామాలలో 25 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్.ఒక్క సీసీ కెమెరా100మందిపోలీసుసిబ్బందితోసమానం.సైబర్ నేరాల నియంత్రణ,డ్రగ్స్ నియంత్రణ లో ప్రజలు అప్రమంతముగా ఉండవలెను.జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 25సీసీకెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య, ఐపీఎస్., ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని,ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని , సీసీ కెమెరాల ద్వారా గ్రామంలోజరిగేఅనుమానాస్పదకార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశంఉంటుందని,సాంకేతికపరిజ్ఞానంవినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని,నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు.ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరు వారి భద్రత కోసం సి సి కెమెరా లను పెట్టాలని చెప్పారు.ఇది వారి భాద్యత గా తీసుకోవాలి. దుకాణాల యజమానులుతప్పనిసరిగా సి. సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జక్రాన్ పల్లి గ్రామంలో 25 సి.సి కెమెరాలు పెట్టిసహకరించిన గ్రామ పంచాయతీ ను పోలీస్ కమీషనర్అభినందించారు.ఈ సందర్భంగా శజక్రాన్ పల్లి గ్రామాoలో డ్రగ్స్ నివారణ సైబర్ నేరాల పట్ల అవగాహన,రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లోనిజామాబాద్ ఎ.సి.పి ప్రకాష్,సి.సి.ఆర్.బి ఎ.సి.పి నాయుడు,డిచ్ పల్లి సిఐ తిరుపతి జక్రాన్ పల్లి ఎస్ఐ మహేష్ గ్రామ సర్పంచ్. బండి పద్మసత్యం మండలఅధ్యక్షులు.రెక్కల.సురేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.























