సుద్దపల్లి గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ టీ. నళిని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాకు వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ టీ. నళిని మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగమూర్తులు తమ జీవితాలను ధారపోసి పోరాడిన ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. నేటి విద్యార్థినులే రేపటి దేశ భవిష్యత్తు, భావి పౌరులని పేర్కొన్నారు. విద్యార్థినులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీఈటీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























