అత్యవసర వేళలో ఆపన్నహస్తం.ప్లేట్లెట్స్ దానం చేసిన బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 ఏళ్ల చిన్నారికి అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం ఏర్పడింది. ఆపద సమయంలో పేషెంట్ కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు.విషయం తెలిసిన వెంటనే ఒక్క ఫోన్ కాల్‌కు స్పందించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకుని ప్లేట్లెట్స్(A+) దానం చేసిన *బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్* మానవత్వానికి మరోసారి నిదర్శనంగా నిలిచారు.
ఆపదలో ఉన్న వారికి రక్తం, ప్లేట్లెట్స్ అందించడం కేవలం దానం కాదు… ఒక కుటుంబానికి ఆశను ఇవ్వడం, ఒక ప్రాణానికి అండగా నిలవడం. సురేష్ చేసిన ఈ సేవ ఎంతో అభినందనీయం*.
ఈ సందర్భంగా *రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులు *బొనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* రక్తదాత సురేష్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పేషెంట్ కుటుంబ సభ్యులు మరియు గుండెల్లి ప్రశాంత్, ప్రసాద్, KBS బ్లడ్ సెంటర్ ప్రతినిధులు జీవన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం… ప్లేట్లెట్స్ దానం… మనిషికి మనిషి అందించే గొప్ప మానవత్వం. ఎవరికైనా ఎప్పుడైనా రక్తం అవసరం ఉంటే 9666620006,9848687025 నంబర్లను సంప్రదించండి.

























