Homeతెలంగాణఎంఆర్పీఎస్ జిల్లా సదస్సుల కరపత్రాల ఆవిష్కరణ...

ఎంఆర్పీఎస్ జిల్లా సదస్సుల కరపత్రాల ఆవిష్కరణ…

ఎంఆర్పీఎస్ జిల్లా సదస్సుల కరపత్రాల ఆవిష్కరణ…

ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు నిర్వహించనున్న జిల్లా సదస్సులకు సంబంధించిన కరపత్రాలను నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మల్లమారి సుధాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లమారి సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. దళిత జాతి ఆత్మగౌరవం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలు సహా బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు దళితులకు ప్రభుత్వం ద్వారా న్యాయంగా అందాల్సిన హక్కులు, సంక్షేమ పథకాల అమలులో తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు.

ఎస్సీ వర్గాల హక్కుల సాధన కోసం ఆగస్టు 31 వరకు నిర్వహించే జిల్లా సదస్సులను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎస్సీలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు పేరుకే ఉన్నాయని, వాటి అమలులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇటీవల నూతనంగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లమారి సుధాకర్‌ను జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షురాలు సమాధాన ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!