నందిపేట్‌లో వెర్టికల్ సోక్ పిట్ పనులకు శ్రీకారం…
నందిపేట్: గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా రాజ్‌నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ వద్ద ఏర్పాటు చేస్తున్న వెర్టికల్ సోక్ పిట్ పనులను నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ముగ్గు పోసి ప్రారంభించారు.
వెర్టికల్ సోక్ పిట్ ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందని సర్పంచ్ తెలిపారు. భవిష్యత్‌లో నీటి సంరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, నాయకులు భాస్కర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి – నీటి సంరక్షణే మన లక్ష్యం అని సర్పంచ్ ఎర్రం లింగం తెలిపారు.

























