మారథాన్‌లో మెరిసిన కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ…
42 కి.మీ. పరుగులో పతకం.. ఎస్పీ రాజేశ్ చంద్ర చేతుల మీదుగా ఘన సన్మానం
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి: హైదరాబాద్‌లో నిర్వహించిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున 46వ వార్డు కౌన్సిలర్ గెరుగంటి లక్ష్మీనారాయణ పాల్గొని పతకం సాధించారు. కఠినమైన మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి పతకం సాధించడం ద్వారా కామారెడ్డి జిల్లా ఖ్యాతిని చాటారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్ చంద్ర, ఐపీఎస్ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించి అభినందించారు. ఆయన క్రీడాస్ఫూర్తిని, పట్టుదలను ఎస్పీ ప్రశంసించారు.

అలాగే డీఎస్పీ మధుసూదన్ కూడా లక్ష్మీనారాయణను అభినందించి సన్మానించారు. తన విజయాన్ని గుర్తించి సన్మానించిన ఎస్పీ రాజేశ్ చంద్ర, ఐపీఎస్, డీఎస్పీ మధుసూదన్‌కు గెరుగంటి లక్ష్మీనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి క్రీడల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

























