Homeతెలంగాణసాగునీటి కోసం మరో యుద్ధం... లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ - కేసీఆర్...

సాగునీటి కోసం మరో యుద్ధం… లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ – కేసీఆర్…

సాగునీటి కోసం మరో యుద్ధం… లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ – కేసీఆర్…

తెలంగాణలో సాగునీరు, తాగునీటి సరఫరా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో మరో జల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

*_కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్…_*

ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం (BRSLP) సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీటిని ఎత్తిపోయడం లేదని కేసీఆర్ ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద చిన్నపాటి మరమ్మతులు చేస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి సాగునీరు అందుతుందని… కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రాజెక్టును పక్కన పెట్టిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగానికి విడుదల చేయకుండా, పక్క రాష్ట్రం వాడుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ఇదే రకమైన అలసత్వం వహిస్తే తానే స్వయంగా లక్షలాది మందితో ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ విద్యపై తెచ్చిన జీవో 97 ప్రభావం, గురుకులాల్లో వసతుల లేమి వల్ల జరుగుతున్న విద్యార్థుల మరణాలపై సభలో గళమెత్తాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక పేద, మధ్యతరగతి ప్రజలు పడుతున్న గోసను నిలదీయాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

మిషన్ భగీరథ నిర్వహణ లోపాలు, కరెంట్ సరఫరాలో కోతలు, వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే నిర్ణయాలను ఎండగట్టాలని సూచించారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేయడం, సింగరేణిలో అవినీతి, మెట్రో నిర్వహణ భారాన్ని ప్రభుత్వంపై వేయడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ నిధుల విడుదల అంశాలపై ప్రభుత్వాన్ని పట్టుబట్టాలని స్పష్టం చేశారు.

అసెంబ్లీని ప్రజా సమస్యల చర్చా వేదికగా కాకుండా వ్యక్తిగత విమర్శలకు నిలయంగా మార్చుతున్న అప్రజాస్వామిక విధానాన్ని ఉభయ సభల్లో తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన…

0
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన... 6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి... హైదరాబాద్: 6 గ్యారెంటీల అమలు, ప్రజలు...

ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్…

0
ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ మోహన్...

సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ…

0
సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్...

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు…

0
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ…

0
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న దళిత నాయకుడిని బి ఆర్ ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని...

Translate »
error: Content is protected !!