జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జేసీఐ ఇందూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.
జేసీఐ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ అధ్యక్షులు జైపాల్ కాలే మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణను అలవర్చుకుని, పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జేసీఐ ఇందూర్ కృషి చేస్తోందని, అందులో భాగంగానే విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ కార్యదర్శి తేజస్వి, పూర్వాధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్, చింతల గంగాదాస్, తిరునగరి శ్రీహరి, ప్రోగ్రామ్ చైర్మన్ బదావత్ నాగేందర్, నడిపల్లి తండా సర్పంచ్ పవార్ శాంతిలాల్, ఉపసర్పంచ్ బదావత్ గణేష్, వార్డు సభ్యుడు బట్టు మహేష్, పంచాయతీ కార్యదర్శి హాలికరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతిశీల, ఉపాధ్యాయులు ఎం. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

























