అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్ , సెప్టెంబర్ 17 :డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర్ ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల అధ్యక్షుడు గడల ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు, కార్యకర్తలు కలిసి అమర్ ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.అనంతరం భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అమర్ ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేజే నర్సయ్య, చెప్పాల గణేష్, దేవిదాస్, అనంతరావు, మొయిజ్, అతిక్, ఇక్ఱామ్, నీలం రవి, నాగేంద్ర, శర్మ నాయక్, సత్య, గంగయ్య, చౌదరి రతన్, రాజేష్, ఆనంద్, సందీప్,దశరథ్, చరణ్, భాస్కర్ నవీన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.























