కామారెడ్డి రోగులకు యశోదలో రోబోటిక్ మోకాలి మార్పిడి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
కామారెడ్డి సెప్టెంబర్ 17: కామారెడ్డి జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. యశోద హాస్పిటల్స్, సోమాజిగూడలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వివేకానంద ఆధ్వర్యంలో CORI రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆర్థరైటిస్, వయసు పెరగడం, మోకాలి వైకల్యం వంటి కారణాలతో బాధపడుతున్న వారికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఉపశమనం కలిగిస్తోంది. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలో అధిక కచ్చితత్వం, కంప్యూటర్ ఆధారిత మార్గదర్శకత్వం, వ్యక్తిగత 3డీ ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తారు.
CORI రోబోట్ ద్వారా ప్రతి రోగి మోకాలి నిర్మాణానికి అనుగుణంగా శస్త్రచికిత్సను ముందుగానే ప్రణాళిక చేయడంతో ఇంప్లాంట్‌ను ఖచ్చితమైన స్థానంలో అమర్చేందుకు సహాయపడుతుందని డాక్టర్ వివేకానంద తెలిపారు. దీని వల్ల చుట్టుపక్కల కణజాలానికి తక్కువ నష్టం, తక్కువ నొప్పి, వేగవంతమైన కోలుకోవడం, రోజువారీ కార్యకలాపాలకు త్వరగా తిరిగి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
డాక్టర్ వివేకానంద జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలి శస్త్రచికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందారు. Mako, ROSA, Navio వంటి అధునాతన రోబోటిక్ వ్యవస్థలతో అనుభవం కలిగిన ఆయన, తెలంగాణ ప్రజలకు ప్రపంచస్థాయి మోకాలి మార్పిడి వైద్యం హైదరాబాద్‌లోనే అందించడమే లక్ష్యమని తెలిపారు.
దీర్ఘకాలిక మోకాలి నొప్పి, ఆర్థరైటిస్ లేదా మోకాలి వైకల్యంతో బాధపడుతున్న రోగులు రోబోటిక్ మోకాలి మార్పిడి తమకు అనుకూలమో లేదో తెలుసుకోవడానికి యశోద హాస్పిటల్స్, సోమాజిగూడలోని డాక్టర్ వివేకానంద మరియు ఆర్థోపెడిక్ బృందాన్ని సంప్రదించవచ్చు.

























