వృద్ధులకు ఉచిత వైద్య సేవలు…
దోమకొండ గడిట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
దోమకొండలో ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలు పొందలేని వృద్ధులకు గడిట్రస్ట్ అండగా నిలుస్తోంది.
ఎనిమిదేళ్లుగా ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ సేవలందిస్తోంది.
ఇందులో భాగంగా గడిట్రస్ట్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
డాక్టర్ షరీఫ్ పర్యవేక్షణలో వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో సుమారు 80 మంది వృద్ధులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.
గ్రామంలోని వృద్ధులు శిబిరంలో పాల్గొని గడిట్రస్ట్ సేవలను అభినందించారు.
ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గడిట్రస్ట్ ప్రతినిధులు గణేష్ యాదవ్, వినయ్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

























