ధర్పల్లి ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో మారుతి. తెలిపారు.తహశీల్దార్ శాంత. ఏఈపీఆర్, ఏఈ ఎలక్ట్రిసిటీ, ఏఈ హౌసింగ్కు సంబంధించి ఒక్కో ఫిర్యాదు వచ్చిందన్నారు. మండలస్థాయి అధికారులు ప్రజావాణికి హాజరవుతున్నందున ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శాంత. ఎంపీవో శ్రీధర్. మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

























