గుడి తండా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫాం పంపిణీ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తాండ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన దుస్తులను గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్, ఉపసర్పంచ్ గోవింద్ నాయక్, ఉపాధ్యాయులు విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మి. వరలక్ష్మి. విద్యార్థులు పాల్గొన్నారు

























