ధర్పల్లిలో గ్రామంలో చేయూత పింఛన్ల వెరిఫికేషన్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలో చేయూత పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపట్టారు. దరఖాస్తుదారులు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నట్లు మండల సూపరింటెండెంట్ సారంగపాణి తెలిపారు. మండలంలోని 22 గ్రామాల నుంచి 616 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి కార్యదర్శి రాకేష్. సుధాకర్. మధు. సిబ్బంది పాల్గొన్నారు.

























