యువ చైతన్య యూత్ గణేష్ మండపంలో ఘనంగా పూజలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద సోమవారం ఘనంగా గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిరు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య యూత్ సభ్యులు కాలనీ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

























