డిచ్‌పల్లి మండల కేంద్రంలో రూ.36 వేలు పలికిన గణేశుడి లడ్డూ.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన నవచైతన్య గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు.
ఈ వేలం పాటలో గణేశుడి లడ్డూను రూ.36 వేలకు పి. బాలకృష్ణ మేస్త్రీ దక్కించుకున్నారు. భక్తులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలం పాటను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ మండలి అధ్యక్షుడు రవి, ఉపాధ్యక్షుడు సందీప్, కోశాధికారి గద్దె సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 500 మంది భక్తులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

























