ఖోఖో జోనల్ పోటీలకు శ్రీమేధా హైస్కూల్ విద్యార్థుల ఎంపిక…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని శ్రీమేధా హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ఖోఖో జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూనియర్, సబ్‌జూనియర్ విభాగాల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఎంపిక కావడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ మదన్ సురేష్, అరవింద్, ప్రిన్సిపాల్ జయ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులు: – పిప్రా సాకేత్ – 10వ తరగతి (బాలురు), దుమాల జాన్వి – 10వ తరగతి (బాలికలు), లాచల రితీష్ – 8వ తరగతి (బాలురు)
, గుగులోత్ వర్షిణి – 7వ తరగతి (బాలికలు)
విద్యార్థులకు ఖోఖోలో శిక్షణ అందించిన పీఈటీ శ్రీకాంత్ ను పలువురు పాఠశాల యాజమాన్యం
అభినందించారు. జోనల్ స్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని యాజమాన్యం ఆకాంక్షించారు.

























