పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగంపేట గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సై దీపక్ కుమార్ పోలీస్ స్టేషన్ పనితీరు, నేరాల నియంత్రణ, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ వినియోగించే ఆయుధాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
విద్యార్థినులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

























