కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్: హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌లో నిర్వహించే రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మార్గమధ్యలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు చెందిన నాయకులు, నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 200 మంది పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్‌తో పాటు మాజీ జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాగత కార్యక్రమం అనంతరం కేటీఆర్ కాన్వాయ్ ఆదిలాబాద్ వైపు బయలుదేరింది.

























