మురికివాడల్లో పోలియో చుక్కల పంపిణీ పర్యవేక్షించిన రాష్ట్ర పరిశీలకులు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోలియో చుక్కల పంపిణీ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా గృహ సందర్శన ద్వారా ఇంటింటికి వెళ్లి బూతు వద్ద పోలియో చుక్కల ను వేయించని చిన్నారుల కోసం ఈరోజు ఇంటి వద్ద పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో పూలాంగ్ బ్రిడ్జి పక్కన ఉన్న మురికి వాడలో రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ సి.వెంకటరమణ పర్యవేక్షించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కల మందును ఈరోజు మరియు మంగళవారం అర్హులైన వారందరికీ అందించా లన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం పై లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన తర్వాత వేసే మార్కింగును పరీక్షించారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక పట్టణారోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అనిల్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, డిహెచ్ఇలు వేణుగోపాల్, వెంకటేశ్వర్లు హెచ్ ఈ ఓ వెంకట్ రవి, వినోద్ ఆశా కార్యకర్త, నర్సింగ్ వాలంటీర్లు ఉన్నారు.























