అంగవైకల్యాన్ని జయిస్తున్న దివ్యాంగులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూలై4 త్రిశూల్ న్యూస్: ఉమ్మడి నందిపేట మండల కేంద్ర మండల పరిషత్ కార్యాలయాల సముదాయ ప్రాంతంలో గల భవిత కేంద్రం దివ్యాంగుల విద్యార్థులకు మంచి విద్యను, శారీరకంగా మానసికంగా మెరుగుపడేందుకు ప్రోత్సాహకాలను అందిస్తుంది ప్రభుత్వం. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి అవధూత గంగాధర్ మాట్లాడుతూ…. మానసికంగా శారీరకంగా వికలాంగులు గల పిల్లలకు సైతం విద్య అదాలని, మిగతా పిల్లల తో తక్కువ కాకుండా వారిలోని నైపుణ్యాన్ని కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మండలానికి దివ్యాంగుల భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఆయా కేంద్రాలలో ఒకటి నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేసుకొని వారికున్న అంగవైకల్యాన్ని అధిగమించేందుకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్వుఫేషియల్ తెరఫీ ఇలాంటివి ఫ్రీగా అందించి వినికిడి యంత్రాలను, బ్రెయిన్ పుస్తకాల వంటి అసిస్టెవ్ డివైస్ ల ద్వారా వారికి విద్య బోధన చేయడం జరుగుతుందన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్ సిహెచ్ అక్షర మాట్లాడుతూ…. గర్భధారణ సమయంలో సరైన అవగాహన లేక చేసిన తప్పుల వల్ల పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని, అలాగే బిడ్డ ఎదిగే సమయంలో తల గాయం వల్ల కూడా దివ్యాంగులు అవుతారని, దివ్యాంగుల తల్లిదండ్రులు నిరాశ చెందకుండా వారికి మంచి వైద్యం అందించి ప్రోత్సహిస్తే వారు కోలుకునే అవకాశం ఉందని అందుకే ప్రభుత్వం భవిత కేంద్రాల ద్వారా సేవలందిస్తుందని ఫిజియోథెరఫీ చేయడం వలన బ్రెయిన్ కు స్పైన్ కు కోఆర్డినేషన్తో మంచి ఫలితాలు పొందవచ్చని అన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎస్ నగేష్ గౌడ్, భవిత సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.























