Homeత్రిశూల్ న్యూస్టీఆర్ఎస్ పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట...

టీఆర్ఎస్ పార్టీ పేరుపై కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట…

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరు కేటాయింపు వివాదంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది మే 12, జూన్ 23 తేదీల్లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నోటీసులకు ఇప్పటివరకు స్పందించని కవిత.. నేరుగా ఈరోజు(మంగళవారం) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం వారం రోజుల్లో కవిత తన అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి హైకోర్టు సూచించింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు నమోదై ఉన్నందున అదే పేరును కవితకు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని, గతంలో ఇలాంటి వ్యవహారాల్లో ఎవరికీ వ్యక్తిగతంగా వాదనలు వినడానికి అవకాశం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదని ఇప్పటికే కవితకు స్పష్టం చేసినట్లు ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు కవిత తరఫు న్యాయవాది మాత్రం టీఆర్ఎస్ పేరును ఆమెకు కేటాయించాలని కోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో కవితకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండానే ప్రతికూల నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు వారం రోజుల్లో కవిత అభిప్రాయాలను తెలిపిన తర్వాత వ్యక్తిగతంగానూ ఆమె వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!