జులై 10న ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ…
తెలంగాణ : రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జులై 10న ప్రతిష్టాత్మకంగా ‘రైతు ఆశీర్వాద సభ’ను నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం సభాస్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం ఏడు రోజుల్లోనే రూ.7,491 కోట్ల రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు.























