వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమ పాలనకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో టౌన్ ప్రెసిడెంట్ పర్శ అనంత్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆరిగేలా జనార్దన్, కౌన్సిలర్ అంజుమ్, నాయకులు రాడే బలరాం, వాక మహేష్, నవీన్, అనిల్, బొర్రన్న తదితరులు ఉన్నారు.

























