కొత్త HIV కేసులు గుర్తించాలి…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో
ఈరోజు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం కార్యక్రమం మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంను జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ, 2026 డిసెంబర్ 1 వరకు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 0.32% ప్రివలెన్స్ ప్రకారం 5874 మంది సోకిన వారు ఉంటారని అంచనా. ఇందుకు గాను ఇందులో 5580 మందికి (95%)హెచ్ఐవి స్తితి తెలిసి ఉండాలి అని target ఇచ్చారని అందుకుగాను మన జిల్లాలో 5451 (93%) హెచ్ఐవి స్థితి తెలిసింది. ఇంకా 136 హెచ్ఐవి కేసులను త్వరగా గుర్తుపట్టి వారందరినీ చికిత్స మీద పెట్టాలని మేడమ్ అన్నారు. ఇందుగను ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, హైరిస్కున్న పాపులేషన్ గుర్తించి టీమ్ వర్క్ గా పనిచేసి నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, DPM సుధాకర్, CSO నవీన్, CPO moheej ahmed, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సిబ్బంది , టిబి నియంత్ర సిబ్బంది.మరియు స్వచ్ఛంద సంస్థ లు పాల్గొన్నారు.























