నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని రెండు ప్యాకేజీల సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖకు చెందిన పలు ప్రాజెక్టుల వ్యయ సవరణలు, నెట్టెంపాడు తొలి ప్యాకేజీ టెండర్ల రద్దు, నిర్మాణ సామగ్రి వ్యయాలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక అంశాలపై కూడా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.























