పట్టణాల్లోని పేదల కోసం 2BHK ఇళ్ల నిర్మాణం!
తెలంగాణ : పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చింది. గృహ నిర్మాణాల అనుమతులకు సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు ద్వారా 2BHK తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఈ స్కీమ్ కింద నిర్మించే ఇళ్లకు ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కూడా ఇవ్వనుంది.























