నందిపేటలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూలై 23 త్రిశూల్ న్యూస్: మండల బాజపా ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్ర బస్టాండ్ ఎదురుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముంగట చేసిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఖండిస్తూ బిజెపి శ్రేణులంతా రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పటేళ్ల రాజు మాట్లాడుతూ…. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందట కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ పై చేపట్టిన నిరసన కార్యక్రమంలా కాకుండా దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి యువతను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, శాంతియుతంగా చేసే నిరసన ర్యాలీలో, నిరసనకు సంబంధంలేని అంశాలపై మాట్లాడడం, దేశద్రోహుల కు మద్దతుగా నినాదాలు చేయడం లాంటి చర్యలు అనుమానాస్పదంగా కనబడుతున్నాయని, దేశ భద్రత గురించి మోడీ రాజీపడడని, ఆయన పరిపాలనను చూసి దేశ ప్రజలే గాక ప్రపంచ వ్యాప్తంగా హర్షించే విషయాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, దానికి తోడు దేశ విచ్చిన్నరకర శక్తులంతా ఒకటిగా ఏర్పడి మోడీని గద్దెదించాలని చూస్తున్నారని, వీరి ఆటలు మోడీ ముంగట సాగవని ఎద్దేవ చేశారు. బీజేవైఎం నాయకులు నాగ సురేష్ మాట్లాడుతూ… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ పరిపాలనను చూసి ఓర్వలేక పోతున్నాడని, ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ కాన్ సిద్ధంగా ఉన్నాడని, అతను రాహుల్ గాంధీ కాడని రాహుల్ కాన్ అని, భాజపా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పలాలు అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయనే ఆక్రోషంతో మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదని, ప్రశ్న పత్రాల లీకేజీ పై పార్లమెంట్లో చర్చకు సిద్ధమని ప్రభుత్వం తెలిపితే చర్చలో పాల్గొనవలసింది పోయి ప్రధాని ఇంటి ముంగట అరాచకం సృష్టించడం సిగ్గుచేటని రాహుల్ ఖాన్ అని తీవ్ర పదజాలం తో విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.























