భీమ్‌గల్: బడిబాట సక్సెస్..కానీ పుస్తకాలు ఎక్కడ?
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల కొరతతో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినా పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదనే విమర్శలున్నాయి. బడిబాటతో అడ్మిషన్లు పెరిగినా విద్యార్థులకు పుస్తకాలు లేక ఎలా బోధించాలని, తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పుస్తకాలను అందించాలని కోరుతున్నారు.























