రామ్ మందిరంలో ఏకాదశి పండుగ….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జులై 25 త్రిషూల్ న్యూస్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర శ్రీ రామ్ నగర్ రామ్ మందిరంలో శనివారం తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది . అలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ సభ్యులు పెయింటర్ రాజు మాట్లాడుతూ…. సంవత్సరంలో మొదట వచ్చే ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అంటారని, ఆషాడమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు నుండి శ్రీమహావిష్ణువు నాగశేషువులపై నాలుగు నెలలు పాటు యోగ నిద్రలోకి వెళతాడని, ఈ చాతుర్మాస్య దీక్ష సమయం నా భక్తులు ఉపవాసంతో దీక్ష చేస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకమని ఆయన అన్నారు. అందుకే ఈరోజు ఉత్సవమూర్తులకు సామూహిక అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మంద సాయన్న, సీతారాం, కండక్టర్ నారాయణ, సాగర్, మేరా నరసయ్య, తదితరు పాల్గొన్నారు.























