కేశవరం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగదీష్ నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కేశవరం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగదీష్ను ఆదివారం నియమించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రిక్క దినకర్, ఆర్మూర్ చిన్న బాల్రాజ్, గాదె నరేష్, మనోహర్ రెడ్డి, చెలిమెల శ్రీనివాస్, చెలిమెల చిన్నారెడ్డి, పుప్పాల సుభాష్ రాజు తదితరులు పాల్గొని జగదీష్‌కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువతను సమీకరిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























