రూ.5.17 కోట్ల బైపాస్ బీటీ రోడ్డుకు నిధులు మంజూరు… మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నాగేష్
కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి రూ.5.17 కోట్ల వ్యయంతో బైపాస్ బీటీ రోడ్డును మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్కను గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యులు బాస వేణుగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ప్రజాప్రతినిధులు సీతక్కను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ, ఉప్లూర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన బైపాస్ బీటీ రోడ్డుకు రూ.5.17 కోట్ల నిధులు మంజూరు చేయడం గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ నిధులు కేటాయించిన మంత్రి సీతక్కకు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులకు కూడా అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా, గ్రామ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో.సర్పంచ్ శైలందర్ ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు డా. నరేష్, వార్డు సభ్యులు దాసరి రాకేష్, సాధుల్లా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం రాజేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ సుంకరి విజయ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

























