అడవి పందిని వేటాడుతున్న ఎనిమిది మంది అరెస్ట్…
వరంగల్ జిల్లా: నర్సంపేట మండలంలోని రామవరం శివారు పరిధిలో ఉచ్చులు, బోనులతో అడవి పందిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అటవీ శాఖ/పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి వేట సామాగ్రితో పాటు, వారు ఘటనా స్థలానికి ఉపయోగించిన 3 మోటార్ బైక్లను అధికారులు స్వాధీనం చేసుకుని వీరి బారి నుంచి ఒక అడవి పందిని సురక్షితంగా రక్షించారు. నేరస్థులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని, తదుపరి రిమాండ్ నిమిత్తం వారిని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.























