Homeతెలంగాణతెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?

*హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం*

*కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే*

*కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు జూరాల వద్ద లిప్ట్ నిర్మించాలి*

*తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్*

హైదరాబాద్ : తెలంగాణ నీటి హక్కులను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ద్వారా ఏపీ హరించుకుపోతుంటే మన ముఖ్యమంత్రి సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా మన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడుతున్నారని అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నీటి హక్కులను కాపాడాల్సిన సమయంలో కొడంగల్-నారాయణ్ పేట్, మక్తల్ అనే బక్వాస్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఏపీకి వంతు పాడుతూ మోడీ ముందు సీఎం మోకరిల్లుతున్నారని.. ఆయనను తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు.

*ఏపీ దోపిడీపై మౌనమెందుకు?*

తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీకి వంత పాడుతుండటం సిగ్గుచేటని అన్నారు. ఎల్ నినో పేరు చెప్పి కేఆర్ఎంబీ జల దోపిడీకి సహకరిస్తోందని అన్నారు. విభజన చట్టం నిబంధనలు ఒక్క తెలంగాణాకే వర్తిస్తాయా.. ఏపీ వర్తించవా.. ఆ విషయం కేఆర్ఎంబీకి తెలియదా అని ప్రశ్నించారు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ ఆపాలని ఆదేశించడం ఏకపక్షమని.. కేఆర్ఎంబీ తీరును కేంద్రం వద్ద సీఎం ఎండగట్టాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ఏపీ నీటిని మళ్లించుకునేందుకే శ్రీశైలంలో పవర్ జనరేషన్ ఆపాలని కేఆర్ఎంబీ ఆదేశించిందని మండిపడ్డారు. ఈ వాటర్ ఇయర్ లో ఏపీ ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 26 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ ద్వారా 12 టీఎంసీలు, కేడీఎస్ కు 26 టీఎంసీలు వాడుకుందని.. అదే సమయంలో హైదరాబాద్ తాగునీటితో కలుపుకొని తెలంగాణ వాడుకున్న నీళ్లు 15 టీఎంసీలకు మించలేదన్నారు. ఏపీ జల దోపిడీని అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. మాట్లాడితే పాలమూరు బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి కృష్ణా నీళ్లలో అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోవడం అన్యాయమన్నారు.

*మోడీ ముందు మోకరిల్లితే ప్రజలు క్షమించరు*

కృష్ణాలో మన నీటి హక్కులను పూర్తి స్థాయిలో వాడుకోవాలంటే జూరాల భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టాలని నవీన్ సూచించారు. తెలంగాణ రక్షణ సేన తరఫున ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నామని గుర్తు చేశారు. జూరాల నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టకుండా కేసీఆర్ తప్పు చేశారని.. అదే తప్పును రేవంత్ కొనసాగిస్తున్నారని తెలిపారు. కృష్ణా జలాల దోపిడీపై సీఎం మౌనం వహిస్తూ ఏపీకి వంత పాడుతుండటంతో కేఆర్ఎంబీ ఆడింది ఆట పాడింది పాటగా తయారైందన్నారు. వెలిగొండ టన్నెల్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సాగర్ కుడి కాల్వ, కృష్ణా డెల్టా సిస్టం నుంచి ఏపీ జల దోపిడీ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి ఆ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ఎందుకు మోడీ ముందు మోకరిల్లుతున్నారో చెప్పాలన్నారు. కేఆర్ఎంబీ తీరును వ్యతిరేకిస్తూ కేంద్రంపై జంగ్ సైరన్ చేయాలని నవీన్ సూచించారు. లేదంటే తెలంగాణ భవిష్యత్ తరాలు సీఎం క్షమించవన్నారు. ముందు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లు పూర్తి చేయటంతో పాటు జురాల వద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు.

*నాడు అన్యాయం చేసి ఇప్పుడు విన్యాసాలా?*

కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబీ విధానాలపై బీఆర్ఎస్ చేస్తున్న విన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఇదేదో కొత్తగా జరుగుతున్నట్లు ఆ పార్టీ మాట్లాడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఎన్నో సార్లు కేఆర్ఎంబీ పవర్ జనరేషన్ ను ఆపే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో మొదటి రెండేళ్లు ఏపీకి 63 శాతం, తెలంగాణకు 37 శాతం పంపకాలుండగా దాన్ని ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతానికి తగ్గించడానికి అని ఒప్పుకున్నదే బీఆర్ఎస్ సర్కారు అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్…

0
గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణేష్ మండలి నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల...

సమాజానికి సోషల్ వర్కర్ల అవసరం ఎంతో ఉంది..

0
సమాజానికి సోషల్ వర్కర్ల అవసరం ఎంతో ఉంది.. సోషల్ మీడియా ప్రభావంతో కొత్త తరహా మానసిక సమస్యలు.. పరిష్కారానికి సోషల్ వర్కర్లు అవసరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... ప్రస్తుత సమాజంలో సోషల్ వర్కర్ల అవసరం...

తాత మధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్…

0
తాత మధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్, సెప్టెంబర్ 7: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా...

నిజామాబాద్ లో బిఆర్ఎస్ భారీ ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం పై గణేష్ బిగాల ఆగ్రహం

0
కాంగ్రెస్ ప్రభుత్వ రౌడీయిజం, నిరంకుశ పాలనపై మండిపడ్డ గణేష్ బిగాల... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులను నిరసిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా... నిజామాబాద్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం...

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలి: గణేష్ బిగాల…

0
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలి: గణేష్ బిగాల... నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని నిజామాబాద్...

Translate »
error: Content is protected !!