Homeఇందూరుఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బుధవారం అసెంబ్లీలో సీఎంను కలిసి పలు అభివృద్ధి పనులతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఔటర్ రింగ్ రోడ్లకు అనుమతులు ఇవ్వాలని, మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని కోరారు. కళాభారతి పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో పాటు రాజారాం స్టేడియం ఆధునికీకరణ, పాత కలెక్టరేట్ మైదానంలో సింథటిక్ ట్రాక్‌తో కూడిన స్టేడియం, ఇండోర్ స్టేడియం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ఇందూరు ఖిల్లా రామాలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆలయాన్ని రెవెన్యూ శాఖ నుంచి దేవాదాయ శాఖకు బదిలీ చేయాలని కోరారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మరమ్మతులు, మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి, వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చాలని తెలిపారు.

ముఖ్యంగా నిజామాబాద్ బస్టాండ్ ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్....

0
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,...

20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…

0
20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన సమావేశం అనివార్య కారణాల...

లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్…

0
లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: ఎన్‌ఎండీసీ 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున ప్రతిభ కనబరిచిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణను...

పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్…

0
పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 నాలుగో సవరణ బిల్లు–2026కు...

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు…

0
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు ...

Translate »
error: Content is protected !!