నిజామాబాద్ జిల్లాలో మట్టి వినాయకుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటిపల్లి నరేష్ రెడ్డి పాల్గొని మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, స్థానిక కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్, కో-ఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించాలని నాయకులు ప్రజలకు సూచించారు.

























