Homeకమ్మర్‌పల్లి మండల్కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన...

కోనాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం పర్యటన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్ డివిజన్ తనిఖీ బృందం సందర్శించి ప్యానల్ తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీ బృందానికి నోడల్ అధికారిగా కాసం శ్రీనివాస్ వ్యవహరించగా, సభ్యులు చిన్నయ్య, విశ్వనాథం, రమేష్, గంగా మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికలు, విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాల బోధన పురోగతిని తనిఖీ బృందం పరిశీలించింది. అదేవిధంగా కిచెన్ గార్డెన్, గణిత, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయం, పరీక్షల ఫలితాల మెరుగుదలకు చేపడుతున్న చర్యలను సమీక్షించింది.

ముఖ్యంగా పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతి, వెనుకబడిన విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక బోధన, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులందరూ మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, డిజిటల్ విద్యా సదుపాయాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పారిశుధ్యం, పచ్చదనం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందించేలా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

ఈ తనిఖీ ద్వారా పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన పలు సూచనలు అందించారు.

చౌడారపు రాంప్రసాద్ ప్రధానోపాధ్యాయులు (GHM)

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోనాపూర్.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

0
కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్: హైదరాబాద్...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం…

0
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం రైతు గర్జన సభకు వెళ్తున్న కేటీఆర్‌కు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన డిచ్‌పల్లి నాయకులు... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో...

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

Translate »
error: Content is protected !!