భీంగల్ 1వ వార్డులో జల శక్తి అభియాన్–జన్ భాగీదారి కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ గజానంద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలోని 1వ వార్డులో “జల శక్తి అభియాన్–జన్ భాగీదారి (JSJB-3.0)” కార్యక్రమంలో భాగంగా “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్ స్థానిక ప్రజలకు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ఇంటి చెత్తను తడి–పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. వర్షాకాలంలో ప్రతి శుక్రవారం నిర్వహించే “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా కూలర్లు, టైర్లు, కొబ్బరి బొండాలు, పూల కుండీలు తదితర వాటిలో నిల్వ ఉండే నీటిని తొలగించి దోమల వ్యాప్తిని నివారించాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దోమల మందు పిచికారీ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరె నాగమణి స్వామి, వైస్ చైర్‌పర్సన్ సంటి లతా నర్సయ్య, 1వ వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ నాగేందర్, మెప్మా సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

























