కోనసముందర్ గ్రామంలో వర్షాకాల ముందస్తు శుభ్రత, భద్రత చర్యలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ గ్రామంలో వర్షా కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు చేపట్టే ముందస్తు చర్యలలో భాగంగా గ్రామపంచాయతీ తరపున గ్రామం లో ఉన్న మినీ వాటర్ ట్యాంక్ లను శుభ్రం చేయించారు. అలాగే బ్లీచింగ్ మరియు డ్రైనేజ్ పక్కన & రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు కు గడ్డి మందు పిచికారి సర్పంచ్ బెజ్జారం రాకేష్ దగ్గరుండి చేయించారు. గ్రామంలో వర్షాకాలంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం తగిన చర్యలను ప్రభుత్వం సూచనల మేరకు ఎప్పటికప్పుడు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా తమ వంతుగా వర్షాకాల ప్రభావం తమ అనారోగ్యాల పై పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























