శ్రీ విద్యాసాయి హై స్కూల్ లో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీ విద్యా సాయి హైస్కూల్‌లో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మర్‌పల్లి సబ్ ఇన్ స్పెక్టర్ (SI) సి.హెచ్. సతీష్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ బుల్లీయింగ్ వంటి నేరాలు పెరుగుతున్నాయని, వీటి పట్ల విద్యార్థులు, యువత నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదని స్పష్టం చేశారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంగారెడ్డి హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో పాటు కమ్మర్‌పల్లి పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























