అమీర్ నగర్ లో అంగడి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని అమీర్ నగర్ (దమ్మన్నపేట్) గ్రామంలో కొత్తగా ఆగస్టు 17 , సోమవారం (అంగడి)సంత ను గ్రామ సర్పంచ్ మరియు వీ డీ సి ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. తొలుత రోజు అన్ని రకాల కూరగాయలు , వస్త్ర సముదాయ దుకాణాలు, పలు రకాల వ్యాపారులు వచ్చారు. వస్తూ, కూరగాయలు కొనుగోలు దారులు సైతం నూతనంగా ఏర్పాటు చేసిన సంత లో ఉస్సాహంగా (ఆసక్తి) గా పాల్గొన్నారు. ప్రతీ సోమవారం అంగడి కోసం భీమ్ గల్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన భారం తగ్గింది అని గ్రామస్తులు,చుట్టుపక్కల గ్రామాల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొందరు ఈ అంగడి ద్వారా ఉన్న ఊళ్ళోనే కొనుగోలు చేసే సదుపాయం కల్పించిన గ్రామ అభివృద్ధి కమిటీ కి, సర్పంచ్ కి ధన్యవాదాలు తెలిపారు. అమీర్ నగర్ గ్రామంలో అంగడి నిర్వహణ కొరకు బస్టాండ్ ఏరియాలో విశాలమైన స్థలం ఉందని,ప్రతీ సోమవారం ఈ అంగడి కొనసాగుతుందని vdc సభ్యులు & సర్పంచ్ తెలిపారు.























