సితాయిపేట్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సామూహిక కుంకుమార్చన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లోని సితాయిపేట్ గ్రామంలో నూతనంగా నిర్వహించిన శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు వేదపండితులు కిరణ్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కుటుంబంలో సుఖసంతోషాలు మహిళల సౌభాగ్యం కలకాలం ఉండాలని కుంకుమార్చన నిర్వహించినట్లు కిరణ్ స్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు























