శ్రావణ మాసంలో లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో దైవ దర్శన యాత్ర…
సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా బుధవారం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో దైవ దర్శన యాత్రను నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమారు 50 మంది స్వామీజీలు పాల్గొని వేద పఠనం, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, యజ్ఞం నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దండాల నాగరాజు శర్మ, రాజు పంతులు, వేద పండితులు ప్రశాంత్ శాస్త్రి, సిద్ధిపేట శ్రీపాద శర్మతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

























