పింఛన్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు..
దళారులను నమ్మొద్దు.. డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలోని పింఛన్ లబ్ధిదారులు దళారులను నమ్మవద్దని మున్సిపల్ చైరపర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ సూచించారు.
పింఛన్లు ఇప్పిస్తామని చెప్పి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసే దళారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పింఛన్ మంజూరు కోసం ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
లబ్ధిదారుల ఇంటివద్దనే ఆన్‌లైన్ ఫొటో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.
పింఛన్ ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మోసపోవద్దని సూచించారు.
అలాంటి వ్యక్తుల వివరాలను వెంటనే మున్సిపల్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి మధ్యవర్తుల మాటలను నమ్మవద్దని చైర్‌పర్సన్ ఇప్ప ఉమరాణి శ్రీనివాస్ సూచించారు.

























